పుట:Aliya Rama Rayalu.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాయబారులను బంపెను. ఆవెనువెంటనే అసాదుఖానుగూడ తనపూర్వవాగ్దత్తమును జ్ఞప్తికి దెచ్చుచు రాయబారులను బంపెను. అందువిషయమై వారిరాజ్యాంగసభలో తీవ్రమైనచర్చ జరిగెను. విజాపురసుల్తానుతో గలపూర్వసాంగత్యమును బురస్కరించుకొని 'అబ్దుల్లా' వ్యవహారమును వదలుకొనుటయె పర్యవసానముగ నేర్పడియెను. ఇయ్యది ఇబ్రహీమునకు సంతృప్తికలిగింప జాల దయ్యెను. అబ్దుల్లా గోవానగరముననుండుటయె తనకపాయకర మనియెంచి తనసోదరుని తనవశముచేయ వలసిన దనియతడు కోరెను. అతడు తన ప్రభుత్వమున కతిథిగా నుండుటవలన వారందుల కియ్యకొన రైరి. అతనిదూరదేశమునకునైన బంపివేయవలసిన దనియిబ్రహీము ప్రార్థించెను. అందునకు వారంగీకరించి విజాపురరాజ్యమున కెట్టియపాయము కలుగకుండునటుల వానిని కన్ననూరునకు బంపిరి. అప్పుడు విజాపురసుల్తాను 1546 వ సంవత్సరము ఆగష్టు 22 వ తేదీని సాల్‌సెట్టి, బర్డెజ్, పర్గాణాలను పోర్చుగీసు వారికి నొసంగెను. అయినను కొంతకాలమైనవెనుక అబ్దుల్లా గోవానగరమున మరల గానిపించెను. అబ్దుల్లాను మలాకాద్వీపమునకు బంపెద ననిసుల్తానుకు గోవాగవర్నరు వాగ్దత్తము చేసెను గాని యెన్నడును నెఱవేర్ప దలంపలేదు.

కొన్నిసంవత్సరములయిన వెనుక 'డోమ్‌పెడ్రోమాస్కెరెనుహాను' గోవాగవర్నరుగానియమింప బడెను. అహమ్మదునగరసుల్తా నగుబురహాన్‌నిజాముషా దురదృష్టవంతు డయిన