పుట:Aliya Rama Rayalu.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రేరేపింప బడియెను. ఆదిల్‌షా సామంతులలో బ్రముఖుడుగా నున్నవాడును బెల్గాముదుర్గాధిపతియు నగునసాదుఖాను వారిలోనొకడుగా నుండెను. ఇతడు గోవాకెప్టె నగు 'డోమ్ గర్సియా' (Dom Garcia) తో నిందువిషయమై యుత్తర ప్రత్యుత్తరములు జరుపు చుండెను.

విజాపురసుల్తానగు 'ఇబ్రహీముఆదిల్‌షా' కు బదులుగా ఘూర్జరమునకు (Guzarat) వలసపోయిన 'అబ్దుల్లా' రాకొమరుని రప్పించి విజాపురమునకు నిజమైనసుల్తానుగా నిలిపినయెడల కొంకణదేశము నంతయు బుడతకీచులకు (Portuguese) వశపఱతు ననివాగ్దత్తము చేసెను. ఇందుకునాతడు మిక్కిలిసంతోషించి కాంబేలో నున్నయాతనికి నొకలాతీన్‌చేకబురు పంపెను. అంత అబ్దుల్లా కొంతకాలమునకు దనకుటుంబముతో గోవానగరమునకు వచ్చెను. ఆకెప్టెను ఒకమహారాజునకుస్వాగత మొసంగి నట్లుగానాతనికి మన:పూర్వక మైనస్వాగతము నొసంగి జెన్యూటుకాలేజికి సమీపమున నున్నయొక దివ్యసుందరభవనమున నాతని బ్రవేశపెట్టి యొకగొప్పవిందు గావించెను. ఎవ్వనిస్థానమున డోమ్‌గర్సియా కెప్టెనుగా నియమింపబడెనో యాస్థానాధిపతి యైన 'డోమ్‌మార్టిన్‌ఆఫాంచోడిసౌజా' (Dom Martin Affonso De Souza) గోవానగరమునకు వచ్చి తనయుద్యోగమును మరల వహించెను. ఇబ్రహీముఆదిల్‌షా తనపూర్వస్నేహమును బాటించి తనసోదరుని గోవానగరమునుండి వెడల జేయవలయు ననివెంటనే