పుట:Aliya Rama Rayalu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నటుల వినియోగించుకొందురు. రామరాయలుజమీనా కిచ్చుటకు నిచ్చగించె' నని ప్రత్యుత్తర మిచ్చి వెడలిపోవుచుండ నాయబ్సీనియాదేశస్థుడు ఇబ్రహీమును జూచి 'నీహక్కును కత్తితోసాధించి స్థాపించుకొనలేనిపిఱికిపంద' వని మరల దూఱెను. అంత నారాజకుమారుడు వానిని వివేకహీనునిగా గ్రహించెను. వీనిశాంతము వానికోపము నినుమడింప జేసెను. అంబరుఖా నధిక దూషనమునకు గడంగి వానిమనస్సు నొప్పింప జేసెను. ఆవెనువెంటనే ఇబ్రహీము గుఱ్ఱమునుండి క్రిందికి దుమికి కత్తి దూసెను. అంబరుఖాను వానిపై బడెను. ఇబ్రహీము తనప్రతిపక్షిని ఖండించి వైచెను. అంబరుఖాను సోదరుడుకూడ నిబ్రహీముపైకి లంఘింప నాతనిగూడ మట్టుపెట్టెను.

ఆసంవత్సరమె జమ్షీదుకుతుబ్షా గోల్కొండనగరములో మృతి బొందెను.

ఇబ్రహీముపట్టాభిషిక్తుడగుట

గోల్కొండనగరములోని ప్రభుపుంగవులు జమ్షీదుకుమారు డైన 'సుఖాన్‌కూలీ' అనువానిని వానితల్లికోరిక ననుసరించి పట్టాభిషిక్తుని గావించి 'సెయిఫ్‌ఖాను' పాలనకర్తగా నియమించిరి. ఈపాలనకర్త యదివఱకు జమ్షీదుకుతుబ్షాచే నొకప్పుడు ప్రపానశిక్షను బొంది యహమ్మదునగరమునకు బంపబడినవాడు. ఇతడు 'సుఖాన్‌కూలీ' కి సంరక్ష