పుట:Aliya Rama Rayalu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలు కంపిల్లు చుండిరి. వీనిసోదరు లయిన 'హైదరుఖాన్, ఇబ్రహీమ్‌' అనువారు బీదరునకు బఱు విడిరి. అచట హైదరుఖాను మరణము జెందెను. ఇతడు మరణించుటకు బూర్వము బీదరుసుల్తా నగు 'ఖాశింబరీదుషా' అహమ్మదు నగరము, గోల్కొండ, సుల్తానులతో యుద్ధముచేయుచు నోడిపోయి పాఱివచ్చుసందర్భమున ఇబ్రహీముయొక్క దుస్థితిని నందుగా జేసికొని యాతిథ్యమర్యాద నతిక్రమించి యాతని యేనుగులను, ధనమును చూఱగొన బ్రయత్నించెను. వీని దురాలోచనమును విని వెంటనే యిబ్రహీము విజయనగరమునకు బాఱిపోయి రామరాయలమైత్రి నపేక్షించెను. ఇబ్రహీము విజయనగరము ప్రవేశించినపుడు వీనితో సయ్యదుహై అబ్సీనియాదేశస్థుడును, హమీదుఖా ననుబిరుదమువహించిన రైహాన్, బ్రాహ్మణు డగుకాణాజియు, మఱికొందఱుసేనకులును కూడ నుండిరి. అళియరామరాయలు మిక్కిలిసంతోషించి యీగోల్కొండరాజకుమారుని నర్హోచితమర్యాదలచే నాదరించి వానిజీవనార్ధ మదివఱకు అబ్సీనియాదేశస్థు డగు అంబరుఖాను క్రింద నున్నజమీని ఇబ్రహీమున కొసంగెను. ఈకార్యము వలన ఇబ్రహీమునెడ అంబరుఖానును ద్వేషమును బుట్టించెను.

ఇట్లంబరుఖాను తనసంస్థానమునుగోల్పోయి విచారముతో దిరుగుచు నొకనాడు విజయనగరవీధులలో ఇబ్రహీమురాజకుమారునిం గలిసికొని తనజమీ నపహరించినవా డని దూషించెను. చక్రవర్తులు తమసొత్తును తమయిచ్చవచ్చి