పుట:Aliya Rama Rayalu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవమార్గ మనుసరించుట యుక్తమని తెలుపగా నెల్లవారంగీకరించిరి. ఒకనాడు సూర్యోదయమైన వెంటనే యాయుభయసైన్యములవారు నాకస్మికముగా బోయి, ఇబ్రహీమ్‌ఆదిల్‌షా సైన్యములపై బడిరి. అపుడు విజాపుర సుల్తాను అభ్యంగన స్నానము చేయుచున్నవా డగుటచేత దప్పించుకొని పాఱిపోవుట కడుగష్టసాధ్యమయ్యెను. వానిసైన్యము లాశ్చర్యమును వెఱవునుగొని మందుగుండు సామాను సయితము యాపద్వస్తుసామగ్రిని శత్రువులకు విడిచిపెట్టి చెల్లాచెదరై పాఱిపోయి రట. ఈసమయమునందే సదాశివనాయకుడు ధైర్యసాహసముల జూపి శత్రువులతో బోరాడి కళ్యాణిదుర్గమును వశపఱచుకొని అళియరామరాయలవలన 'కోటికోలాహల' బిరుదమును గాంచె ననిశివతత్త్వరత్నాకర మను గ్రంథమువలన దెలియు చున్నది.[1] ఇప్పటినుండి యీదుర్గము రామరాయలవశమునం దున్నట్లే కనబడు చున్నది.

జమ్షీదుకుతుబ్షామరణము

క్రీ. శ. 1550 సంవత్సరమున గోల్కొండసుల్తా నగు జమ్షీదుకుతుబ్షా యనారోగ్యస్థితి యందుండి చంచలస్వభావుడై చీటికిమాటికి జిరాకుపడుచు స్వల్పదోషములకై ప్రజలననేకుల జంపించ నారంభించెను. వీనిదౌర్జన్యమును గాంచి

  1. Sources of vijayanagar History p. 195, 199.