పుట:Aliya Rama Rayalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుడుగ నుండుట గొందఱ కిష్టము లేకుండెను. ఈక్రొత్తసుల్తాను పదేండ్లయిన వయస్సులేని బాలుడు. అందువలన గొందఱుప్రభుపుంగవు లందుముఖ్యముగా బ్రధానమంత్రి యగు 'ముస్తఫాఖాను' వెంటనే బయలుదేఱి గోల్కొండకు రావలసినదిగా నిబ్రహీమున కొకజాబు వ్రాసి విజయనగరమున కొకరాయబారిని బంపెను. ఇబ్రహీ మాజాబును గైకొని కష్టకాలమున దనతోగూడ నున్న తనయిర్వురుమిత్రు లయిన సయ్యదుహై, హమీదుఖానులకు జూప వారలును సంతోషముతో గోల్కొండకు బోవ సమ్మతించిరి. ఇబ్రహీము తనకు మిత్రుడుగానుండి యాదరించిన రామరాయలతో గూడ నాలోచింప నతనియభీష్టమున కనుకూలముగానే ప్రత్యుత్తరమిచ్చుటయెగాక యాతనికి దోడ్పాటుగ నుండుటకై పదివేలయాశ్విక సైన్యమును ఇరువదివేలపదాతిసైన్యమును దీసికొని యిబ్రహీమువెంట బోవలసిన దనితనసోదరు డయినవేంకటాద్రి కుత్తరు వొసంగెను. ఈసందర్భమునగూడ ఫెరిస్తావ్రాయుచు దనకు రామరాయలయెడ గలయసూయను ద్వేషమును జూపక మానలేదు. ఇబ్రహీము మిత్రు లిర్వురును "రామరాయలు రాజ్యము నపహరింపగోరి యింతగొప్పసైన్యముతో సోదరుని పంపుచున్నాడుగావున నాతని సాహాయ్యమును దిరస్కరించి రావలసినదిగా నిబ్రహీమునకు బోధించి రనియు నత డట్లే గావించె ననియు వ్రాయుచున్నాడు. అతనివ్రాత విశ్వాసపాత్ర మైనదికాదు. హీరాసుఫాదిరి ఫెరిస్తావ్రాతను ఖండిం