పుట:Aliya Rama Rayalu.pdf/128

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హిందూ సామ్రాజ్య మగువిద్యానగర సామ్రాజ్యము నకుముప్పుగలుగకమాన దనినిశ్చయించుకొని వారిపోరాటము లలో దానుగూడ బాలుగొని తనపరిపూర్ణమైన రాజ్యతంత్రజ్ఞానముతోగూడిన రాజనీతినంతయు వినియోగించి తనశత్రురాజ్యములలో నైకమత్యము లేకుండ జూచుటయె వృత్తముగా గలిగి యుండెను. తక్కినసుల్తానులతో యుద్ధముచేయుటకై యొకప్పు డొకనితోను, ఇంకొకప్పుడు మఱియొక్కనితోను జేరుచు యుద్ధములు సలిపెను. ఈరీతిగా దనయిరువదిమూడు సంవత్సరముల పరిపాలనములోను నెల్లరతోను బోరాడి మహమ్మదుమతస్థులయిన యాసుల్తానుల నోడింపుచు నెప్పుడును విజయభేరీ మ్రోగింపుచు విజయనగరమునకు మరలి వచ్చుచుండెను.

అహమ్మదునగరసుల్తాను ఒకసంవత్సరకాలము మౌనము వహించి యూరకున్నవాడై 1544 వ. సంవత్సరప్రారంభమున గోల్కొండసుల్తానగు జమ్షీదు కుతుబ్షాకడకు 'షాతహీర్‌' అను రాయబారిని విజాపుర సుల్తానుతో యుద్ధముచేయుటకై రహస్యముగా రామరాయలుతో నొడంబడిక చేసికొనవలసినదిగా మాట్లాడుటకై పంపించెను. ఎన్నడో తన రాజ్యమునుండి విజాపురసుల్తాను గైకొన్న యైదుమండలములను తిరిగి స్వాధీనము చేసికొనవలయు ననిబురహాన్‌నిజాముషా యొక్కతలంపట. అహమ్మదునగరసుల్తాను, గోల్కొండసుల్తాను, అళియరామరాయలు సంధిపత్రములపై సంతకములు చేసిరి.