పుట:Aliya Rama Rayalu.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

విజాపుర రాజ్యముయొక్క దక్షిణభాగమును విద్యానగరసైన్యములును, తూర్పుభాగమును గోలకొండ సైన్యములును, పశ్చిమోత్తరభాగమును ఆలీబరీదుషా, క్వాజాజహానుల సైన్యములతో బురహాన్‌ నిజాముషాయును ముట్టడించుటకు నిశ్చయించుకొని రట!

ఇట్టియొడంబడిక జరిగినవెనువెంటనే బురహాన్‌నిజాముషాతన సైన్యములతో విజాపురరాజ్యమున బ్రవేశించి చాలవఱకు నష్టము గలిగించుటయెగాక ఇబ్రహీము ఆదిల్‌షాను యుద్ధములలో బెక్కుతడవులు జయింపుచు వచ్చెనట! ఈకాలముననే గోలకొండసైన్యములు తూర్పు భాగమును ముట్టడించి కాక్నిమండలమును స్వాధీనపఱచుకొని యచటనొక కోటను నూతనముగా నిర్మించి కలుబరిగి దుర్గప్రాకారముల వఱకు: గలదేశమంతయు నాక్రమించుకొని కడపట నగరదుర్గమునకు సమీపమునం దున్నయాతగిరిదుర్గమును ముట్టడించెనట! అళియరామరాయల పక్షమున వేంకటాద్రి రాచూరు దుర్గమును ముట్టడించుటకై దండయాత్రవెడలి భీమరథిప్రాంతమున విజాపురసుల్తానును దలపడి యాతనినోడించి తఱిమెనట! ఈయుద్ధవర్ణనమె నరసభూపాలీయము నందు కలదని హీరాసుఫాదిరి వక్కాణించెనుగాని నరసభూపాలీయము నందలి యుద్ధ మింతకుబూర్వ మనగా 1542 వ సంవత్సరములో జరిగినదిగాని 1544 వ సంవత్సరమున జరిగినది కాదని యిదివఱకే తెలిపి యున్నాను. ఇట్లు చిక్కులలో దగుల్కొని