పుట:Aliya Rama Rayalu.pdf/127

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


           బురమెల్ల బ్రత్యగ్రభూతిపాలుగ జేసి
                  యచలాసనాభ్యాసియై కృశించు
           రతినిభరామానుగతమైత్రిపైరోసి
                  కలనైన గళ్యాణ కాంక్షయిడడు
           నరవి బ్రాణాయామసంసిద్ధికై సారె
                  సారెకు గుండలిస్థాన మంటి

        గీ. మానకనిజాముడపవర్గమార్గవృత్తి
           బెరయుపరబుద్ధినెవ్వాని పేరుదలచి
           యతడు శ్రీరాము డఖిలసన్నుతికి దగడె
           సేతు కాశీతలాంతర భ్యాతయశుడు."

ఈప్రథమ సంవత్సరమున జరిపినదండయాత్రల నన్నిటి యందు మహావిజయములను గాంచి యళియరామరాయలును వానిసోదరు లిర్వురును సకలకర్ణాట సామ్రాజ్యమును సముద్ధరించి జగన్నుతి గన్నవారలగుచు సుఖముగా మరలి రాజధానియగు విద్యానగరము బ్రవేశించిరి.

రామరాయలు సుల్తానులపట్ల చూపిన రాజనీతి పద్ధతి దక్కనుసుల్తానులకు దమతమ సరిహద్దులలో నుండుదుర్గములనుగూర్చిన తగవులచే నైకమత్యము లేక పరస్పరాసూయలతోను గలహములతోను గాలము గడపుటయేగాక యప్పటప్పట యుద్ధములుగూడ జేయుచుండిరి. అళియరామరాయ లీదక్కను సుల్తానులెల్లరు నైకమత్యముతోనున్న నెప్పటికైన