పుట:Aliya Rama Rayalu.pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


      "శా. విశ్వామిత్రుని గొల్చి రాము డత డుర్విం జెందె గళ్యాణము
          న్విశ్వామిత్రులు గొల్వరాము డిత డుర్వి జెందె గళ్యాణమున్
          శశ్వత్కీర్తులురాములయ్యిరువురున్ సాధించుకళ్యాణలా
          భైశ్వర్యంబులుధర్మనిర్మధనధర్మాలంబనవ్యగ్రముల్."

అళియరామరాయలీకళ్యాణనగరమును బురహాన్‌నిజాముషానుండి బలాత్కారముగా గైకొనియుండుటచేతనే యాతనిబిరుదుగద్యములో 'గళ్యాణనగరసాధక' యన్న బిరుదముగూడ జేర్ప బడినది. ఇంతటితో దృప్తినొందక బురహాన్‌నిజాముషా వంటిశత్రువును స్వాధీనపఱచుకొన కుండవిడిచి పెట్టుట ప్రమాదహేతు వగుననిచింతించి యళియరామరాయలు తనసోదరులతో బర్యాలోచించి యహమ్మదునగరముపై దండెత్తిపోవుటకు నిశ్చయించుకొని సోదరత్రయమును దమతమసైన్యములతో వానిని దఱుముకొనుచు బోయిరి. అహమ్మదునగరసమీపమున బురహాన్‌నిజాముషాఘోరసంగ్రామమును జరిపెను. ఇచట బురహాన్‌నిజాముషాకు బరాజయము సంభవించుటయెగాక యీయుద్ధమునుండి పాఱిపోవుచున్న వానిని పొన్నలాపురము హండేహనుమప్ప నాయడు పట్టుకొని వాని సైన్యములు జయఘోష మిడుచుండ వానినిగొనివచ్చి యళియరామరాయలముందు బెట్టెను. అళియరామరాయలసైన్యము లహమ్మదునగరమున బ్రవేశించి కోటలనాశనము గావించి