పుట:Aliya Rama Rayalu.pdf/125

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నగరమునాగళ్లతో దుక్కిదున్నించి యాముదాలుచల్లించి రని యాంధ్రకవులు వర్ణించిరి. ఇతడహమ్మదునగరమునువిడిచి యచటికి నలుబదియేబదిమైళ్ల దూరమున నున్న గోదావరినిదాటి పోయె ననియు నచటికి నీసోదరత్రయమును శత్రువర్గమును నురుమాడుటవలన రక్తసిక్తములయిన తమ ఖడ్గములను గోదావరిలోనగడిగి రనికవులువ్రాసిరి. బహుశ: హండేఅనుమప్పనాయడు గోదావరిని దాటి పారిపోవుచున్న కాలముననే బురహాన్‌నిజాముషాను బట్టుకొని యుండు నని విశ్వసింప వచ్చును. అహమ్మదునగరవినాశము నరపతివిజయ మనుగ్రంథమున నిట్లువర్ణింప బడినది.

         "సీ. హరిశౌర్యుడగుతిర్మాలాధీశ్వరుండు ద
                   దవరజుం డగువేంకటాద్రి రాజు
             భుజయుగంబుగ బలస్ఫురణతో గరిహరి
                   వరవీరభటులతో దొరలతోడ
             దనయాజ్ఞ మీఱినకినుక నిజాముపై
                   దండెత్తి తఱిమి యుద్దండవృత్తి
             నత డేలుచున్నట్టి యామదానగరంబు
                   చాలెత్తి మఱి యామదాలు వేసి.

          ఆ. సేతు కాశిమధ్యభూతలనుతజయ
             శ్రీవరించివేడ్కచే జెలంగె
             రామమూర్తియైనరామరాజేంద్రుడు
             సాంద్రవిభవజిత సురేంద్రు డెలమి."