పుట:Aliya Rama Rayalu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుతుబ్షా సైన్యములను పానుగల్లుదుర్గముకడ సంధించి యతని నోడింపగా నాతడుగోలకొండకు బాఱిపోయెను. అంతటితో దృప్తినొందక గోలకొండవఱకు దఱుముకొనిపోయి యాదుర్గమును ముట్టడింపగా జమ్షీదుసంధిచేసికొనుట యుక్తముగా భావించి యళియరామరాయలతో రాయభారములు జరుప దూరదృష్టితో నతడందుల కంగీకరించి సంధి గావించుకొనియెను. తిరుమలరాయల సైన్యములు కళ్యాణ నగరదుర్గముకడ బురహాన్ నిజాముషా సైన్యములతో దలపడిపోరాడుచున్న కాలమున నళియరామరాయల సైన్యములు తూర్పుదిక్కుననుండియు, వేంకటాద్రిసైన్యములు పడమటిదిక్కున నుండియు దమతమ విజయయాత్రలను ముగించుకొని మధ్యభాగమున నున్న తిరుమలరాయల సైన్యములను గలిసికొనియెను. ఇట్లుగలిసికొన్న సోదరత్రయముతో బోరాడుట బురహాన్ నిజాముషాకు దుర్భరమై పోయి కళ్యాణినగరమును శత్రువులకు విడిచిపెట్టి పలాయనుడై యహమ్మదునగర మార్గమునుబట్టెను. కళ్యాణి బట్టుకొన్నవిషయము వసుచరిత్రమునం గానరాదని హీరాసుఫాదిరి తలంచినది సత్యముకాదు.వసుచరిత్రమునందా విషయము వక్కాణింపబడినది. చూడుడు.


[1]

  1. (The Vasucharitramu does not give any information about the capture of Kalyani, Which belonged to the Sultan of Ahmadnagar). The Aravidu Dynasty of Vijayanagar, p. 76.