పుట:Aliya Rama Rayalu.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఒకప్పుడు గోల్కొండనబా బగు 'సుల్తాను కూలీకుతుబ్షాహ' విజయనగరసామ్రాజ్యముపై దండయాత్రవెడలి సరిహద్దుల నున్నమండలముల గొన్నిటిని వశపఱచుకొని తురక సైన్యముల నచట నిలుపుట కిష్టపడక హిందూ సామంతకుటుంబములోనివాడయిన రామరాజును నధికారిగా నియమించెనట! అటుపిమ్మట మూడుసంవత్సరములకు బిమ్మట విజాపురసుల్తానగు 'ఆదిల్‌షాహ' సైన్యములు కేవలము దోపిడికొనగోరి వచ్చి పైబడి రామరాజును వెడలగొట్టి దేశమునంతయు గొల్లగొనగా రామరాజు పాఱిపోయి సుల్తానుకూలీకుతుబ్షాకు తనపరాభవమును విన్నపించుకొనెనట! అంతట సుల్తానుకూలీకుతుబ్షాహ రామరాజునుగాంచి 'ఛీ! పాఱుబోతా! నీవు నాదర్బారులో నుండదగవు; పొమ్ము;' అని దేశమునుండి వెడలగొట్టె నట! అంతట రామరాజు విజయనగరమార్గముబట్టి కృష్ణదేవరాయలకడ నుద్యోగమును సంపాదించె నట! ఈవాక్యములు గోల్కొండపట్టణములో నుండెడునొక యనామకు డైనచరిత్రకారుడు వ్రాసిన నని ఫెరిస్తా తాను వ్రాసిన చరిత్రమునం దెక్కించి యున్నవాడు.[1] విజయనగరసామ్రాజ్యమును బరిపాలించినకడపటివంశమగు నారవీటివంశమును గూర్చినచరిత్రమును వ్రాయుచు హీరానుఫాదిరి యీయనామకుడయినచతిత్రకారు డనుభవముతో వ్రాసినదియగుటచేత

  1. Forista Vol. III p.380; Aravidu Dynasty Vol.I p. 25.