పుట:Aliya Rama Rayalu.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


"సీ. ఖలు నతిద్రోహి నల్కయతిమ్మని హరించి
             సకలకర్ణాటదేశంబునిలిపె
    నతుని వర్ధితుని దత్సుతుని బట్టము గట్టి
             కుతువనమల్కన క్షోణి నిలిపె
    బదిలుడై రాచూరు ముదిగల్లు గప్పంబు
             సేయ గాంచ నపాదు సీమ నిలిపె
    శరణన్నమల్కనిజామున కభయంబొ
             సంగి తదీయరాజ్యంబు నిలిపె

గీ. నవని యంతయు రామరాజ్యంబు సేసె
    దనగుణమ్ములు కవికల్పితములు గాగ
    నలవియె రచింప సత్కావ్యములను వెలయ
    భూమి నొక రాజమాత్రుడే రామవిభుడు."

అని యేమహారాజు తనవిద్యాపరిషదంబున భూషణప్రాయుడుగా నుండి 'రామరాజభూషణుం' డన బ్రఖ్యాతి వహించి మించినమహాకవి భట్టుమూర్తిచే పొగడ్తల గాంచెనో అట్టి వీరశ్రీరామరాజును 'పెరిస్తా' యను నొకచరిత్రకారుడొకయనామకు డగుచరిత్రకారుని వాక్యములను బురస్కరించుకొని తానువ్రాసిన యొకచరిత్ర గ్రంథమునం దొకపిఱికిపందనుగా బ్రవేశపెట్టినవిధము సత్యాన్వేషణపరాయణు లగుచరిత్రకారు లెల్లరును బరిశోధించి విమర్శించి సత్యమును బ్రకటించుట మఱువ దగదు.