పుట:Aliya Rama Rayalu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అళియ రామరాయలు

ప్రథమ ప్రకరణము

"సీ. పట్టాభిషేకవిపర్యయంబున బ్రోలు
         వెడలి ప్రియానుజు ల్వెంట గొలువ
    జిత్రకూటాభిఖ్య జెలగు పెన్గొండ సాం
         ద్రహరిద్విపేంద్ర నాదవని జెంది
    ఖలజనస్థానవాసుల బల్వుర వధించి
         మహిమ సలకఖరన్మయ మడంచి
    వారివీరభటమహోద్ధతి నబ్ధి గంపింప
         దురమున గదిసి తద్ద్రోహి దునిమి

తే. యనఘతరపార్ధివేందిర నధిగ మించి
    సాధుకర్ణాటవిభవసంస్థాపనం బు
    పూని శరణాగతుల నెల్ల బ్రోచె రాము
    డతడు నిజచరితంబు రామాయణముగ."