పుట:Aliya Rama Rayalu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనిని చులకనగా ద్రోసివేయజాలమని వ్రాయుచున్నాడు.[1] ఇదియెంతమాత్రము విశ్వాసపాత్రముగా గన్పట్టదని రామరాయల యొక్క పూర్వోత్తరచరిత్రమును నిష్పక్షపాతబుద్ధితో బరిశీలించినవారికి బొడగట్టక మానదు. కనుక రామరాయల యొక్కపూర్వులచరిత్రమును ముందుగ దెలిసికొను టత్యావశ్యకముగనుక వారిచరిత్రమునుగూడ సంగ్రహముగా నిట దెలుపుచున్నాడను.

రామరాయలపూర్వులు

దక్షిణహిందూదేశచరిత్రమునందు గడు బ్రఖ్యాతి గాంచినవంశమునకు జెందినవాడు రామరాజు. ఇతడాంధ్రుడు. కర్ణాటభాషలో గన్నడకవి యగుతిరుమలార్యుడు గన్నడప్రభువయిన చిక్కదేవరాయల దగువంశావళి 'చిక్కదేవరాయవంశావళి' యనుపేరిట వ్రాసినగ్రంథములో 'ఆంధ్రకులదరామరాజం' అని రామరాజును ఆంధ్రునిగా జెప్పియున్నాడు. ఇతనివంశము 'రామరాజీయ' మనునామాంతరమును వహించిన 'నరపతివిజయ' మనుగ్రంథములో పౌరాణికచంద్రవంశముతో ముడిపెట్ట బడినది. ఇతని దాత్రేయసగోత్ర మని వర్ణింప బడినది. ఇతనివంశమున చారిత్రకపురుషు లగునందరాజును, చళుక్యరాజును, బిజ్జలరాజును పేర్కొనబడియుండుట చరిత్రమునకు విరుద్ధముగ నుండుటచేత విశ్వాసపాత్రముగ

  1. The Aravidu Dynasty Vol. I p. 19.