పుట:Aliya Rama Rayalu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శించి యుండలేదని హండేవారి అనంతపురచరిత్ర మనుస్థానిక చరిత్రమును బట్టి దెలియుచున్నది. వీరుసలకము తిమ్మయను వానిసైన్యములను ముందుబెట్టుకొని వానివెనుక తాము తమ సైన్యములతో నిలువంబడి యుద్ధసన్నద్ధు లైరి. అళియరామరాయల సైన్యములం దలపడి తిమ్మయసైన్యములు హతముకాగా దిమ్మయ రణరంగమును విడిచి పాఱుచుండ శిరచ్ఛేదనము గావింపబడె నన్నవార్త చెవినిబడినతోడనే వీరును యుద్ధభూమిని విడిచి తొలగిపోవ విడిచిపెట్టక, అళియరామరాయల సైన్యములు వీరినివెంబడించిపోయె ననియింతకు బూర్వమె దెలిపి యున్నాడను.

ఇక్కడ విమర్శనీయ మగునొకముఖ్యాంశము గలదు. దక్కనుసుల్తానులను జయించిన తరువాత సదాశివరాయనికి బట్టాభిషేకము జరిగినదా? అంతకు బూర్వమే పట్టాభిషేకముజరిగినదా? ఇందునుగూర్చి చరిత్రపరిశోధకులలో భిన్నాభిప్రాయములు గలవు.

"విజయనగరచరిత్రమునకు మూలప్రమాణము" (Cources of Vijayanagar History) లనుగ్రంథమునకు నవత్యార్నికను వ్రాసినవారు మొదట నొకపేరాలో నిట్లువ్రాసిరి. "హండేవారి అనంతపుర చరిత్రమునుబట్టి సోదరత్రయము మొదట పిచ్చివానిని గెల్చి వానినిసంహరించి తరువాత అహమ్మదునగరముబీదరు, గోల్కొండసుల్తానుల సైన్యములగలిసికొనుటకు ముందునకు సాగిపోయి యుద్ధములో వారినిజయించి