పుట:Aliya Rama Rayalu.pdf/104

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భిషేకము జరిగియుండవలయు ననిస్పష్టమగుచున్నది.[1] వీరప్రతాపకఠారిసాళువ వీరసదాశివరాయ దేవరాయ మహారాయలు బాలుడైనందున నాతనిప్రధానకార్యకర్తగానుండి యళియరామరాయలవారా సంవత్సరముననే సామ్రాజ్య పరిపాలనా భారమువహించి కృష్ణదేవరాయలనాటి కీర్తివైభవముల పునస్థాపనము గావించి యఖిలకర్ణాట సామ్రాజ్యము యొక్కవిజృంభణము మఱికొంతకాలము భూమిపై సుస్థిరముగావించి శత్రుపక్షమువారి విద్వేషములకు నపనిందలకు బ్రధానకారణభూతు డయ్యును అశేషసామ్రాజ్య ప్రజల మన్నలకు బాత్రుడై మించెను. అజేయపరాక్రమంబున గృష్ణదేవరాయలను, అమేయబుద్ధికౌశలమున దన్మంత్రి శేఖరుడగు తిమ్మరుసును మించినప్రతిభాశాలిగాని సామాన్యుడు గాడు.

దక్కను సుల్తానులను జయించి యదపులోనుంచుట.

విప్లవసమయమున సలకముతిమ్మయకు దోడ్పడవచ్చిన విజాపురసుల్తా నగుఇబ్రహీమ్‌ఆదిల్‌షా, బీదరుసుల్తానగు అమీర్‌బరీదుషా, అహమ్మదునగరసుల్తానగు బురహాన్‌నిజామ్‌షా, గోల్కొండ సుల్తానగుజమ్షీకుతుబ్‌షా, అను దక్కనుసుల్తానులు పల్వురును స్వసైన్యములతో నేతెంచి విద్యానగరమునకు నొక క్రోసుమేరదూరమున దండువిడిసిరిగాని విద్యానగరమును బ్రవే

  1. Epigraphia Carnatika III. Sr. 42.