పుట:Aliya Rama Rayalu.pdf/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సోదరులు రాజధానికి వచ్చి సదాశివరాయని బట్టాభిషిక్తుని గావించిరి."

పైవిధమున వ్రాసినవీరే తరువాతిపేరాలో నిందుకుభిన్నముగా నిట్లవ్రాసిరి.

"వారు విజయనగరముపై దండెత్తి పోయి, రాజధానికి వెలుపల సలకముతిమ్మయను నోడించి నగరములో బ్రవేశించి క్రమముగా సదాశివరాయనిసింహాసనముపై గూరుచుండ బెట్టిరి. ఇదిజరిగినవెనుక నదివఱకు దిమ్మయచే నాహ్వానింపబడివచ్చిన యహమ్మదునగరముబీదరు, గోల్కొండసుల్తానుల సైన్యములను విజయనగరసామ్రాజ్యసీమలనుండి తఱిమి వేయుటకై వారిసైన్యములను గలిసికొనుటకుగాను ముందునకుసాగిపోవలసి యుండెను."[1] హండేవారి అనంతపుర చరిత్రమునందు సదాశివరాయని పట్టాభిషేకముసంగతి యెత్తికొని యుండలేదు. సలకముతిమ్మయ సమరములో సంహరింపబడిన వెనుక విద్యానగరము కృష్ణరాయలరాణులయాజ్ఞా ప్రకారము స్వాధీనపఱుచ బడినదనియు దరువాతనే యళియరామరాయలు దక్కనుసుల్తానులపై యుద్ధములు సాగించె ననియుమాత్రము దెలుపబడి యున్నది. ఇట్లుండినను నిందుకుభిన్నముగా తాముమొదట వ్రాసినవిధముగా నందున్న దనితెలుపుట వారికి బరిశోధనమునందలి యలక్ష్యభావమును సూచింపుచున్నది.


(1)Sources of Vijayanagar History, India p. 15 and 16

  1. Sources of vijayanagar History, Intrs. p. 15 and 16.