పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

83

వీనికెల్ల కారణము ఆతనిగురువు షారాజుకొత్తాల్‌గారి ఉపదేశమే.




ప్రకరణము ౧౭ - మంత్రుల దుర్మరణము

అక్కన్న మాదన్నలకు దేవి కలలో కనఁబడి దాదాఁపు సంవత్సరమగుచున్నది. ఇది కడపటివారము. ఈ వారము దాఁటులోపల తమపతనము నిశ్చయమని ఆ సోదరులు దిన మెదరుచూచుచు తానాషా తుదకు తమ్ము పొండని చెప్పు కాలము చెంతనే యున్నదని తలంచుచు ఒకదినము సాధారణముగ ఎప్పటివలెనే నగరికి పోయిరి. ఉదయము పదునొకండు గంటలవఱకు సుల్తాను గోష్ఠియందు గడిపిరి. ఏవేవోపనులు విచారించిరి. ఔరంగజేబును తఱుమఁగొట్టుట కుపాయము లాలోచించిరి. పదునొకండు గంటలకు వెలికివచ్చి తమ బంగారు పల్లకిలో కూర్చుండిరి. పల్లకీవారు రెండడుగులు పోయిరో లేదో అత్తిమత్తరాయని సిబ్బంది కనఁబడెను. రెండవదర్వాజా దాఁటు సరికి సిబ్బందియెక్కువయై మంత్రుల పల్లకీవారిని చావవెూది తటాలున అక్కన్న మాదన్నల మీఁది కుఱికి వారి తలలు ఖండించివేసిరి. వారితోకూడ వచ్చుచుండిన వారి మేనల్లుఁడు రూస్తంరావు ఈ దురంతరమును చూచి చేయునది లేక ఒకరిరువురతో పోరి ఇంటికిపోఁగా నాతని తఱుముకొని పోయి ఇంటిలోనే కత్తితోపొడిచి చంపిరి. వారి యింటిచుట్టును