పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

40

అక్కన్న మాదన్నల చరిత్ర

వాఁడు. అందఱకన్ననుచిన్న మాదన్న. అక్కన్న మాదన్నలు మాత్రము కొన్నిమైళ్లు ఎదురువచ్చి శివాజీని సగౌరవముగా కొనిపోసాగిరి.

శివాజీరాకకై గోలకొండకు ఆఱుమైళుల దూరమున నుండిన హైదరాబాదు నగరము అలంకరింపఁబడియుండెను. వీథులును సందులును గొందులును సన్నని కుంకుమకెంధూళులచేతను పసుపుపొడిచేతను తెల్లని బియ్యపుపొడిచేతను రచితములైన రంగవల్లులచేత మనోహరముగానుండెను. రాజమార్గములయందును నాలుగువీథులు కలియుచోటులయందును మహా సౌధములకడను గొప్పగడలు నిలిపి వానికి జెండాలును తోరణములును కట్టియుండిరి. వెదుళ్లచేత అటనట గొప్పదర్వాజాలు కట్టి వానిని అలంకరించియుండిరి. జనులు హిందువులును మహమ్మదీయులును వివిధములైన దుస్తులు ధరించి శివాజీయను ఆ వింతపురుషుని చూచుటకు తమకపడుచు నిలిచియుండిరి. స్త్రీ లందఱును మేడలమీఁదను కిటికీలకడను క్రిక్కిరిసియుండిరి.

మహారాష్ట్రసైన్యము పట్టణములో ప్రవేశించెను. సైనికులును వారి యున్నతాధికారులును బహువిధాభరణములతో ఉజ్జ్వలవేషములను ధరించియుండిరి. వారికిరీటములు, వాని విూఁది బంగారము, రత్నములు, వారి జలతారువస్త్రములు, మహారాష్ట్రవేష మంతయు తెలంగాణమువారికి వేడుకగా నుండెను. ఏఁబదివేలసైన్యము సుముహూర్తమున పట్టణమును చొచ్చెను. ‘ఈసైన్యమేగదా ఢిల్లీపాదుషాకు ప్రక్కలోబల్లె