పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౮ - శివాజీ గోలకొండప్రయాణము

41

ముగా నున్నది! వీరేగదా రెండేండ్లక్రింద ఏతగిరిని దోఁచి హైదరాబాదువఱకు వచ్చి కొల్లగొట్టినవారు. వీరేగదా వీరాధివీరులకు గండరగండండ్రు!’ అని జనులు ఱెప్పవాల్పక వారిని చూడసాగిరి.

కొంతసేపు మరాటా ఆశ్వికదళము ఖదంత్రొక్కెను. తర్వాత మావలీలనఁబడు వీరుల కాల్బలము నడచెను. వారి వారి దళనాయకులు జగత్ప్రసిద్ధులు - హమ్మీరరావుమోహితే, ఆనందరావు, మానాజీమోరే, సూర్యాజీమాల్సురే, యెశాజీ కంక్ పోవుచుండఁగా జనులు వారిని తమమిత్రులకు చూపి చూపి వారిచరిత్రములను వర్ణించుచుండిరి. వారితర్వాత శివాజీయొక్క ప్రతీహారి సోనాజీనాయకు, వానివెనుక శివాజీయొక్క అంగరక్షకుఁడు బాబాజీదంధేరేయును పోయిరి. వారి విశాలనేత్రములు, నల్లని కనుబొమలు, కుంకుమ చందనములు ధరించిన నొసలు ప్రస్ఫుటముగ కనఁబడుచుండెను. తర్వాత రఘునాథ హనుమంతెయును అతనిసోదరుఁడు జనార్దనహనుమంతెయును, ప్రహ్లాదనిరాజీయు గ్రంథకారుఁడైన దత్తాజీ త్రింబక్, కేశవపంత్, నీలోమోరేశ్వరరావు, గంగాధరపంత్ మున్నగువారును గుఱ్ఱముల మీఁద నేఁగిరి,

వీరిందఱేఁగినను చూపరులలో సంచలనము కలుగలేదు. వారివెనుక గుఱ్ఱములమీఁద మహామంత్రులు సేనాధిపతులు ప్రభువులు పరివేష్టించియుండ అక్కన్న మాదన్నలు ఇరుప్రక్కల వచ్చుచుండగా వారినడుమ సన్నగా చిక్కిపోయినవ్యక్తి