పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
37
ప్రకరణము 2 . శివాజీ


అప్పడు శివాజీ ఒక ఉపాయము చేసెను, మొగలాయీ వారినుండి బిజాపురమును కాపాడునపనిని తప్పించుకొనెను. ఎట్లనఁగా బిజాపురముమీఁదికి దండెత్తనుండిన మొగలాయీ రాయబారితో తానొక సంధి కుదుర్చుకొనెను, అంతకు రెండేండ్ల నుండి మొగలాయీలు శివాజీతో యుద్ధముచేసి విసిగియుండిరి; తమకు భయపడి భలోల్ ఖాను శివాజీతో చేరఁగానే వారికిని కొంతకష్ట మైనది, భలోలుఖానుమీఁద పైయెత్తుగా మొగ లాయీ రాయబారి తానును శివాజీతో సంధి కోరినందువలన శివాజీకి మంచిదేయైనది, తన ద్రవ్యాకర్షణమునకును దక్షిణ దేశ దండయాత్రకును అనుకూలమని శివాజీ వెంటనే ఒప్పు కొని, తాను కర్ణాటక దేశముమీఁద దండెత్తి తిరిగివచ్చులోపల దాదాపొక సంవత్సర కాలము బిజాపురమునకు మొగలాయిల వలన బాధ లేకుండిన తాను శ్రమపడకయే వారిని రక్షించిన ట్లగునని, అట్టియేర్పాటుమీఁద సంధిషరత్తులు కుదిర్చెను.

ఇన్ని వ్యవహారములలోను మాదన్నమంత్రియున్నాఁడు. శివాజీయుద్దేశము నాతఁడు కొంతవలలికు గ్రహించెను. దక్షిణ దేశముల విూఁదికి శివాజీ కొల్లగొట్టుటకు బయలుదేరిన గోల కొండ గతి యేమగును? బిజాపురమును తాత్కాలికముగా కాపాడుటయైనది, మొగలాయిబాలవలన భయము లేదు, వులకి శివాజీనికూడ న్నేహితుని చేసికొనిన మొగలాయీలను పూర్తి గా నిలుపవచ్చునని తలఁచి మరల శివాజీతో రాయబారము