పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

అక్కన్న మాదన్నల చరిత్ర

యోధాగ్రేసరులను సుల్తానుపక్షమునకు త్రిప్పియుండిరి. మంత్రులకు గౌరవము తగ్గుటతోకూడ బలమును ఉడిగెను. వీరు సుల్తానును త్రిప్పచున్నా రనుమాటపోయి వీరు సుల్తానునకు లొంగిపోవుచున్నారుగాని సుల్తాను వాస్తవముగా సాధువు, లేకున్న వీరిని ఎన్నఁడో కడతేర్చియుండునని జనులు చెప్పకొన సాగిరి.

నాలుగవపర్యాయము చాలరచ్చ జరిగెను. మూసా ముజఫరులు దర్బారులోనే పరస్పరము దూషించుకొనిరి. సుల్తానుయొక్క మాటలను సయితము లక్ష్యముచేయక తిట్టు కొనుచుండిరి. సుల్తాను తనగౌరవమును దర్బారుగౌరవమును కాపాడుకొనవలసియుండెను. సుల్తాను మాదన్నను చూచెను. మాదన్న కనుసైగ చేసెను. వెంటనే తానాషా వారిరువురను ఖైదుచేయుటకు ఆజ్ఞయిచ్చెను. ముందే మాదన్న ఏర్పాటుచే కాచుకొనియుండిన రక్షకవర్గము మూసాముజఫరులను బంధించి కొనిపోయిరి. ఆశిక్ష న్యాయ్యమనియే ప్రజలు తలంచిరి. ఈ మారుకూడ సుల్తాను ఆత్మగౌరవమును నిలువఁబెట్టుకొనుట కొఱకు అట్లుచేసెనని ఆభ్రాంతులు తలఁచిరి. కాని సుల్తాను వారికి మరి విడుదలలేకుండఁజేసెను; వారి యాప్తవర్గమును పూర్తిగా శిక్షించెను. కొందఱు సుల్తానునకు పాదాక్రాంతులై వారిమన్నన వేడిరి. తత్క్షణమే సుల్తాను మూసాముజఫరులు అయోగ్యు లనియు వారికి తానిచ్చినది లఘుశిక్షయనియు నుద్ఘోషించి, మాదన్నను వజీరుగ నియమించి అతనికి ‘సూర్య