పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౫ - ఉపాయసిద్ధి

27

ప్రకాశరావు’ అను బిరుదము నొసంగెను. అక్కన్నను మహాసేనాధిపతిగా నేర్పాటుచేసెను. వారిమేనల్లుఁడు గోపన్నకు మాదన్న సిఫారసుమీఁద భద్రాచలమున తాసిల్దారుద్యోగ మిచ్చెను. వానితమ్ముఁడు వెంకన్నకు ‘రూస్తంరావు’ అను బిరుదిచ్చి ఫౌజుదారు (సేనాపతి)గా నియమించెను. మాదన్న సిఫారసుమీఁద సుల్తాను మహమ్మద్ ఇబ్రహీం అనువానిని మొదట సార్-ఇ-ఖేల్ (అశ్వసాహిణి)గాను తర్వాత నవాబుగాను చేసెను. తర్వాత సుల్తానుయొక్క ఆజ్ఞమీఁద అక్కన్న మాదన్నలను నవాబు లందఱును ఏనుఁగుపై నూరేగించి వారి బసకు కొనిపోయి అచ్చట వారికి చాలగౌరవముచేసి నజరులు చెల్లించి పెక్కుసలాములతో వీడ్కొనిరి. దేవీప్రసాదము ఈవిధముగా నెఱవేరెను.

భానుమూర్తిపంతులు కొమారుల యభ్యుదయమునకు సంతోషించి భార్యతోవచ్చి గోలకొండలోనే నివసింపసాగెను. హనుమకొండలోనుండి మాదన్నసోదరులును వచ్చిరి. విశ్వనాథునకు బక్ష్‌గిరి, అనఁగా సైన్యమునకు జీతము పంచియిచ్చు నధికారమును, మృత్యుంజయునకు పీష్వాయుద్యోగమును లభించినవి. పదవీస్వీకారానంతరము సుల్తానుయొక్క అనుమతి నంది అక్కనయు నాతనిసోదరులును తమ కనుకూలముగా నొక యింటిని కట్టుటకు ప్రారంభించిరి. తండ్రితోను తమవిద్వాన్జీ యైన మాడుపల్లి కృష్ణభట్టుతోను ఆలోచించి ఖిల్లా (కోట)కు తూర్పున సాహుబండ్ అనుచోట, శతాబ్దములు 1593 అగు