పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౫ - ఉపాయసిద్ధి

25

డును సుల్తానునకు తానే ఆప్తుఁడనియు, సుల్తానునకు సాయముచేయు ప్రాధాన్యము తనదేయనియు మఱియొకఁడు తనస్థానము నాక్రమింపఁజూచు శత్రువనియు తలంపసాగెను. వారిలో ద్వేషము వర్ధిల్లసాగినది. ఈద్వేషము వారిసేవకులలోకూడ వ్యాపించి వారు వీథులలో కొట్టుకొనువఱకు వచ్చినది. ఒక దినము మూసా ముజఫరులు పరస్పరము దూషించుకొని రాజ వీథులలో చాల అల్లరిగావించుకొనిరి. వెంటనే ఆవిషయము సుల్తానువఱకు పోయినది. సుల్తాను మాదన్నను రహస్యముగా సలహా యడిగెను. మాదన్న ఇట్లునేర్పెను—వారిరువురను ప్రత్యేకముగా పిలిపించి ఒక్కొక్కనితోను అతనిమీఁదనే తన కభిమానమనియు ఇంకొకనిమీఁద ద్వేషమనియు నమ్మికపుట్టించి, తర్వాత ప్రతిష్ఠకొఱకు నలువురయెదుట తాను దర్బారులో వారిని మందలింపఁబోవుచున్నాననియు, దానిని వేఱుగా భావింపరాదనియు పలికి ఇరువురకును ఒకమారు బుద్ధిచెప్పవలసినది — అని. సుల్తాను ఆప్రకారమేచేసెను. ఇంతవఱకు, మంత్రుల చేతి కీలుబొమ్మ సుల్తానని తలంచుచుండినప్రజలు ఇప్పడు కొంత భయపడసాగిరి. సుల్తాను వాస్తవముగా బలవంతుఁడనియే తలంచిరి. ఆమంత్రు లిరువురును ఇది నాటకమేగదా యని తలంచియుండిరి. ఈవిధముగా రెండుమూఁడుపర్యాయములు జరిగినది. మూసాముజఫరులు కత్తియుద్ధమునకుకూడ సంసిద్ధులైయుండిరి. ఇంతలో అక్కన్న మాదన్నలు లంచములిచ్చియు బెదరించియు ప్రభువులను సామంతులను ఉద్యోగులను