పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

అక్కన్న మాదన్నల చరిత్ర

అక్కన్న మాదన్నలు ― ‘అంతయు అమ్మవారి యనుగ్రహము’ అని దేవిపటమునకు నమస్కరించుచుండఁగా, ఇంతలో, వారిమేనల్లుఁడు గోపన్న వచ్చి ‘తానాషాసుల్తాను వారు మామయ్యలకోసము కబురుపంపినారు. జవాను వచ్చి యున్నాడు. ఏదో తొందరపనియట’ అని చెప్పెను. వెంటనే అక్కన్న మాదన్నలు ఉడుపులు ధరించి బయలుదేరిపోయిరి.




ప్రకరణము ౫ - ఉపాయసిద్ధి

తానాషా సుల్తాను గొప్ప ఎత్తుగడలో నుండెను. తనకు తొలుత రాజ్యప్రాప్తికి కారకులైన ముజఫరు మూసాఖానులు తన్ను కేవల మొకబొమ్మగాచేయుట ఆతనికి కష్టముగానుండెను. వారిని తొలఁగింప నెంచియుండెను. సుల్తాను హృదయమును మాదన్న, మేధావి, క్షణములో గ్రహించెను. సుల్తానుతో నాంతరంగిక సంభాషణ మొదలిడెను; ముజఫరుమూసాలను తత్క్షణమే తొలఁగించిన నిందవచ్చుననియు ఆపని క్రమముగా చేయవలయుననియు మాదన్న సుల్తానున కుపాయముచెప్పెను. ఆయిరువురకును పరస్పరవిరోధ మేర్పడునట్లు చేయుమనెను. వారిలో ఒకనినిమించి యొకనిని, మర్యాద చేయుచుండు మనెను.

నాఁడు తానాషా మాదన్నచే నీతంత్రమును గ్రహించి అట్లేచేయ నారంభించెను. ముజఫరు మూసాలు ఒక్కొక్కఁ