పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౫ - తానాషా కడపటిమాటలు

125

 చేసెదను. లేకపోయిన మెల్లగా బయలుదేరి మ క్కాకు పోయెదను; ప్రభూ మక్కాకు పోయెదను. మక్కా, మక్కా.” అని పలుకుచునే దుఃఖాతి రేకమున వెడలిపోయెను. పాదుషా ఆజ్ఞచే ఎవరును ఆతని నడ్డగింపలేదు. రజాక్ మక్కా చేరలేదు. పర్షియాదేశమునకు పోయి అచ్చట తనజన్మస్థలమగు ‘లార్‌’ లో కొన్ని దినములుండి తర్వాత మక్కాకు పోవుచు దారిలో చనిపోయెను.




ప్రకరణము ౨౫ - తానాషా కడపటిమాటలు

తానాషా దౌలతాబాద్ కోటలో ఖైదిగా 1688 సం॥ జనవరినెలలో ప్రవేశించెను. ఆకోటయందే పదునాలుగు సంవత్సరములు ఆమహనీయుఁడు బందిగా గడపి తుదకు అతిసార భేదులచేత క్రీ . శ. 1702 లో ప్రాణములను వదలెను. ఆతఁడు చనిపోయిననాఁ డొక విచిత్రదైవసంఘటన జరిగినది. ఒకనాఁడు తానాషా చాల జబ్బుగా నుండఁగా ఆకోటను కాపాడునట్టి ఖిలేదారునకు స్వప్న మొకటి వచ్చినది. ఎవరో వచ్చి అతనితో ‘అదుగో తానాషా చనిపోయినాఁడు. ఆతని శవమును తీసికొని పోయి అతనిగురువైన సయ్యద్‌రాజు కొత్తాల్‌యొక్క సమాధి ప్రక్కన సమాధిచేయుము” అని చెప్పిన ట్లుండెను.

తెల్లవాఱఁగానే ఖిలేదారు తానాషాను దర్శించెను. తానాషా తనవైపు చూడఁగానే సలాముపెట్టి ‘తమతోనొక విషయము తత్క్షణము మనవి చేయవలయును’ అనెను. వెంటనే