పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

124

అక్కన్న మాదన్నల చరిత్ర

రజాక్ ― అల్లా! అల్లా! మహాత్ముఁడు తానాషా. ఆయన ఉప్పుతిన్న ఎటువంటి పాపికూడ ఆపని చేయఁడు. అబ్దుల్‌రజాక్‌లారీ చేయనే చేయఁడు.

పాదుషా ― మాకడ సేనాపతిగా నుండుఁడు సాహేబ్.

రజాక్ ― తానాషాసుల్తాౝబహద్దర్ నౌకరి చేసినవాఁడు ముసల్మాౝ ఐనయెడల మఱియొకనికి నౌకరిచేయఁడు జహాపనా.

చుట్టునుండినవారు, అందును గోలకొండనుండి వచ్చిన ద్రోహులు హడలిపోయిరి. పాదుషా ఆశ్చర్యపడెను. తమకు నౌకరి ఇష్టము కాకపోయిన తమకొమారులకు ఇవ్వనిండు’

రజాక్ ― వా రెట్లు పోయిన నాకేమి. బుద్ధిమంతులైనచో వృద్ధికి రాఁగలరు. వారికిని నాకును ఏమి ఇలాఖా?

పాదుషా కేమియు తోఁపక ఇట్లనెను ― ‘అచ్ఛా! అచ్ఛా! తమవంటివారు ఈగోలకొండలో ఇంకొక రుండియుండిన మేము కోటను పట్టియుండఁజాలము. తాము చాల గొప్పవారు. తమ యిష్టమేమి?’

రజాక్ దుఃఖము పట్టలేక ఇట్లనెను. “జహాపనా, నాకు ఇఁకనేమి ఇష్టముండును. మాసుల్తాౝ బంది. మావజీర్లు అక్కన్నమాదన్నలు తమ ద్రోహమువలన ఖూనీ చేయఁబడినారు. మాకోట చెడిపోయినది. ఎక్కడ చూచినను ద్రోహులు కనఁబడుచున్నారు. నాముసలి ప్రాణము ఈశ్మశానమును చూచుచు ఇఁకను ఉండదు. దేవుఁడు దయఁదలచిన తానాషాకే నౌకరి