పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౨౦ - క్షామము

103

నొకఁడు రొట్టెను చూచినట్లు కలగనెనట. ఈ దుఃఖము లేవియు తెలియని పిల్లలు మాత్రము సంతోషముతో నాడుకొనుచు, ఆఁకలివేసినప్పుడు ఏడ్చుచు, తాము పస్తుండి తమకు తల్లిదండ్రులుపెట్టగా తినుచునుండిరి.

గోలకొండ చాలగట్టికోట. ముట్టడి ప్రారంభమైనది మొదలు ఆకస్మికముగా వచ్చి కోటను పట్టవలయునని ఫిరోజు జంగు ప్రయత్నించుచుండెను. కోటలోపలను వెలుపలను కావలియుండు సిబ్బంది మూమూలుగా మూఁడుజాముల వఱకు మేలుకొనియుండుటచే నాల్గవజామున త్రాటినిచ్చెనలువేసి ఉచ్చుత్రాళ్లు విసరి వానిని పట్టుకొని మెల్లగా గోడల నెగఁబ్రాకి లోపల ప్రవేశింపఁదలంచెను. ఒకదినము రాత్రి మూఁడుజాము లైనపిదప ఒక జాము మిగిలియుండఁగా కొందఱు మహావీరులతో నాతఁడు కోటగోడను సమీపించెను. తా నచ్చట నొక బండఱాతి వెనుకనిలిచి తన పరివారమును పని ప్రారంభింప నాజ్ఞాపించెను. ఇరువురు సాహసికులు చాల నేర్పుచూపి కోటగోడలమీఁది కెక్కిపోయిరి. కొందఱు ఉచ్చుత్రాళ్లమూలమున సగముదూరము ఎక్కిరి. కాని వారి దురదృష్టవశమున ఆచోట సంచరించుచుండిన యొక పాడు కుక్క, అచట పడియుండిన శవములను తినుచుండినట్టిది, వీరిని చూచి తటాలున మొఱుగసాగినది. వెంటనే కావలివారు మేల్కొని కాగడాలు వెలిగించిరి. ఆశత్రువులను చూచి వారిని వెంటనే క్రిందికి దొర్లించి చంపిరి. ఇతరుల ననేకు