పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

104

అక్కన్న మాదన్నల చరిత్ర

లను నిలువున చంపిరి. ఈ విపత్తును చూచి దుఃఖపడి చేయునదిలేక ఫిరోజుజంగు వెనుదిరిగి పోయెను. ఇంతలో పాదుషా గారి సైన్యములు చాల దెబ్బ తిన్నవని స్కంధావారములో పూర్తిగా తెలిసిపోయెను.




ప్రకరణము ౨౧ - మరల ముట్టడి ప్రయత్నములు

మేనెల 16-వ తారీఖున కోటలోని కావలిసైన్యము తటాలున వెలికివచ్చి వెలుపలనున్నవారిని కొట్టుటకు ఆరంభించెనని పాదుషాకు సమాచారము వచ్చెను. వెంటనే ఇజత్‌ఖా నను వాఁడు వారిమీఁదికి పోయెనుగాని ఈ యుద్ధములో మొగలాయీలు డెబ్బదిమంది చనిపోయిరి. దాక్షిణాత్యులు ఎందఱు చనిపోయిరో తెలియదు. తర్వాత కోటలోపలివారు పెద్ద ఫిరంగీ నొకదానిని కోటగోడమీఁదికి తెచ్చి దానిని సరిగా పాదుషా యొక్క శిబిరమునకు గుఱిచేసి కొన్నిగుండ్లు కాల్చిరి. అందు కొన్ని పాదుషా నిద్రించు గుడారమునుకూడ ప్రవేశించినవి; కొన్ని చుట్టును తాఁకుచుపోయినవి. పాదుషా భయపడి తత్క్షణమే తనగుడారమునకుముందు రక్షకముగా పందిళ్లను కట్టుట కేర్పాటు చేయించెను. ఎత్తుగోడలవంటి వానినికట్టి వానిమీఁద ఫిరంగుల నెక్కించి కోటగోడమీఁది వారిని కూల్పుమనెను. కావలిసైన్యము విడిసియున్నచోటి కెదటిభూమి పల్లమైనందున పాదుషాకోరిక సాధించుటకు కుదరలేదు. అంతట పాదుషా