పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

అక్కన్న మాదన్నల చరిత్ర

పంపుచు, వారిని పాదుషాను పట్టుకొనినయెడల సాధ్యమైనంత వఱకు ప్రాణములతో చాలమర్యాదలతో తెమ్మని యాజ్ఞాపించెను. అబ్దుల్‌రజాక్‌లారీ మొదలగువారు, పాదుషాను చూడఁగనే తమ హృదయములు దహించుకొని పోవుననియు, ఆతఁడు కావించిన ఘోరములకు ఆతనియందు తమకెట్టి గౌరవ ముండుటకుగాని అవకాశము లేదనియు చెప్పిపోయిరి.

గోలకొండముట్టడి ప్రారంభమైనది. మోర్జాలను అచ్చటచ్చట ఫిరంగులు కాల్చుటకు నిలుపునప్పటికి బిజాపూరు జయించిన ఫిరోజుజంగను నతఁడు వచ్చిచేరెను. మొగలాయీలు సొరంగములు మొదలైనవి త్రవ్వుటకును ఆ కార్యము పైన కనఁబడకుండుటకు పందిళ్లను కట్టుటకును మొదలిడిరి. సముద్ర తరంగములవలె పొంగుచు సైన్యములు వచ్చుచుండినవి. ముట్టడి ప్రయత్నము లిట్లు జరుగుచుండఁగా గోలకొండవారు ఎదిరించుచు అనుదినము అటనట యుద్ధములు చేయుచునే యుండిరి. కోటనుపట్టుట కేర్పాటుచేయఁబడిన మోర్జాలవారు దినదినము కోటవైపు వచ్చుచుండిరి. ఒకదినము ఫిరోజుజంగు మోర్జాలవారిని ముందు నడుపుచుండఁగా గోలకొండసైన్యమును వెంటఁబెట్టుకొని అబ్దుల్‌రజాక్‌లారీ మహావేశముతో మొగలాయీవారిని ఎదుర్కొనెను. మొగలాయీసైన్యములో రాజపుత్రు లనేకులుండిరి. గోలకొండవారు వారిలో చాలమందినిచంపి కిషోర్ సింగ్‌హాదా యనువానిని గాయపఱచి ఖయిదు పట్టుకొనిపోనుండఁగా మొగలాయీలు ప్రయత్నముతో తప్పిం