పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౯ - గోలకొండముట్టడి ప్రారంభము

99

చిరి. గోలకొండవారు చాలమంది చనిపోయిరి. కాని దక్కనీలు చూపిన పరాక్రమమునకు మొగలాయీలు భయపడిరి. పాదుషాసైన్యములోనివారు తమలో చనిపోయినవారిని ఎత్తుకొనిపోవుటయే చాల కష్టముగానుండెను. ఎంత ధైర్యముతో ప్రయత్నించినను సాధ్యము కాలేదు. దాక్షిణాత్యులు తమవారి శవములనేగాక ఢిల్లీవారివికూడ తీసికొనిపోవుచుండిరి. తుదకు పర్షియను తురానీసైన్యములు వచ్చి రంగమును ప్రవేశించినవి. ఆతర్వాత అబ్దుల్‌రజాక్‌యొక్క సైన్యము నాఁటికి విశ్రమించెను.

ఆదినము మొదలు మరల నట్టియుద్ధములు జరుగలేదు. కారణమున్నది. పాదుషా దూతలనుపంపి షేక్‌మిౝహాజ్, షేక్‌నైజామ్ అను నిరువురను గోలకొండ సేనాపతులను లంచములిచ్చి స్వాధీనము చేసికొనసాగెను. వారును తానాషా చేసిన యుపకారములను మరచిపోయి మొగలాయీవారితో చేరిరి. తత్క్షణమే ఔరంగజేబు వారికి మర్యాదచేసి గొప్ప పదవులను బిరుదములను ఇచ్చెను. ఈ యిరువురును కోటను పట్టుటలో శత్రువునకు చాలసాయము చేయసాగిరి. ముట్టడి చాల కాలము సాగినది. కోటలోపల కొంత తుపాకిమందును ఆయుధసామగ్రులు నుండినవి. వీనితో మొగలాయీలమీఁదికి గోలకొండవారు తలుపుల సందులనుండియు, బురుజలనుండియు గోడల మాటులనుండియు ఫిరంగులను తుపాకులను కాల్చుచు బాణములు ప్రయోగించుచు నుండిరి. వీని ప్రయోగముచేత