పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౯ - గోలకొండముట్టడి ప్రారంభము

95

నున్న తర్వాత మరల పాదుషా తనకడకు పిలిపించి తనవెంట ఖైదుల గుడారములోనుంచి కూడ కొనిపోవుచుండెను. ఇట్టి పరిస్థితిలో సికందర్‌ఆడిల్‌షా క్రీ. శ. 1700 సంవత్సరమున ఏప్రిలు 3వ తారీఖున తన ముప్పదిరెండవ సంవత్సరమున చనిపోయెను. పదునాలుగేండ్ల వయసున సింహాసనమారోహించి మంత్రులచేతి కీలుబొమ్మగా కొన్ని సంవత్సరములుండి తర్వాత పదునాలుగేండ్లు ఔరంగజేబుయొక్క బందిగానుండి పాదుషా బంధమును ఈ సంసారబంధమునుకూడ సికందరువదలెను.

తనబందినుండి స్వయముగా విముక్తుఁడైన తమ కడపటి సుల్తానుయొక్క శవము ఊరిలోనికి రాఁగానే వేలకొలఁది జనులు పోయిచూచి ఏడ్చిరి. పెక్కుస్త్రీలు తమ భర్తలే మరణించిన నెట్లో అట్లు ఏడ్చి గాజులు పగులఁగొట్టుకొని అంగ లార్చిరి. పాపము వారేమి చేయఁగలరు! పదునాలుగేండ్లుగా వారికి సుల్తానులేఁడు. ఆతఁడుండినప్పుడును పాలించి యెఱుఁగఁడు. కాని తమకు సుల్తానని యొక డుండెనుగదా యను స్వాతంత్ర్యభావముకూడ పోయినది. తాము కేవలము బానిసలై పాదుషా ప్రీతికి తగినట్లు మెలఁగవలయును గదా యని బిజాపూరువారు ఆక్రందించిరి.




ప్రకరణము ౧౯ - గోలకొండముట్టడి ప్రారంభము

బిజాపూరునకు పట్టినగతియే గోలకొండకును పట్టినది. పాదుషాకు దయాదాక్షిణ్యములు లేవు. 1686 వ సంవత్సరము