పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

అక్కన్న మాదన్నల చరిత్ర

అబ్దుల్‌రజాక్‌సాహెబు, షారెజుఖాను మొదలైనవారితో మొగలాయీవారిని డీకొనుటకు సంసిద్ధుఁడుగా నుండెను. మీర్‌హషీం అనువానివెంట నాతనికుమారుఁడు అబ్దుల్‌కరీం అనువాఁడు వచ్చుచుండెను. ఇంకను గొప్పసర్దారులు వచ్చుచుండిరి. రజాక్‌సాహెబు తనప్రయత్నములను చాలరహస్యముగా నుంచియుండెను. అబ్దుల్‌కరీమును మీర్‌హషీమును గోలకొండకు ఇరువదిమైళ్లదూరమున మునగాలకడకు వచ్చిరి. వెంటనే రజాకుయొక్క యాజ్ఞచేత షేక్‌నైజాము అనుసర్దారును నాతని యధీనమం దుండిన ఆప్ఘనుసైనికులును మొగలాయీవారిమీఁద ఆకస్మికముగా దుమికి, ముట్టడించి పూర్తిగా దోఁచుకొనిరి. ఈదెబ్బలో మీర్‌హషీం చనిపోయెను, అబ్దుల్ కరీము బంధింపఁబడెను. ఆకస్మికయుద్ధముగాన షాఆలముకడ నుండి సాయమువచ్చుటకు అవకాశము లేకపోయినది. ఇదంతయు 1685 సం. నవంబరునెలలో జరిగినది.

వెంటనే మొగలాయీసైన్యము గోలకొండను వదలిపోయెను. ఇంతవఱకును మొగలాయీలు గోలకొండకు వెలుపలనుండి నానాబాధలు పడుచుండిరి. కోహీరులో నుండిన షా ఆలముయొక్క స్కంధావారములోని సిబ్బందికి అన్నములేదు. గుఱ్ఱములకు ఉలవలుకాదుగదా గడ్డికూడ లేదు. సామానులు లాగు బండ్లయెడ్లకు నీళ్లేగతి. ఈస్థితిలో పాదుషా తనకుమారుని వెంటనేబయలుదేరి బిజాపూరును ముట్టడించుటకు తనకుసాయము రమ్మని ఆజ్ఞాపించెను. బిజాపురము సులభముగా