పుట:Akkanna Maadannala Charitra Vedamu Venkataraya Sastri.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకరణము ౧౮ - బిజాపూరు ముట్టడి

91

మొగలాయీలను లొంగునట్లు లేదు. అంతవఱకు షోలాపూరులోనుండిన పాదుషా ఇప్పుడు స్వయముగానే బిజాపూరుముట్టడికి పూనుకొనెను. బిజాపూరును స్వాధీనముచేసికొనినతర్వాత గోలకొండమీఁదికి రావలయునని పాదుషా సంకల్పము.




ప్రకరణము ౧౮-బిజాపూరు ముట్టడి

క్రీ. శ. 1686 వ సంవత్సరము ఔరంగజేబు పాదుషా ఆజ్ఞమీఁద మహమ్మద్ ఆజామ్‌షా బిజాపూరును ముట్టడించెను. ముట్టడించునట్టి మొగలాయీ సర్దారులలో పాదుషాకుమారులు, కోటనుపట్టినకీర్తి తమకే రావలయునని ఒకరినిమించి యొకరు కుట్రలు చేయుచుండిరి. పైగా ఆసంవత్సరము క్షామ మేర్పడెను. ఆహారపదార్థములు దొరకవయ్యెను. కోటలో పనివారిబాధలు వీరికి పదింతలుగా నుండినవి. మొగలాయీలు బయటనున్నందున వారికి సరఫరాలు ఎచటనుండియైన రాగలవుగాని కోటలోనివారి కెట్లు రాఁగలవు? వారికి ఆలోపలనే సర్దుబాటు కావలసియుండెను. మొగలాయీవారు కోటను పూర్తిగా ముట్టడింపఁగానే ఆ యవకాశమును పోయినది. లెక్కలేని జనమును గుఱ్ఱములను కోటలోపల మరణించుచుండినవి. తమకు గుఱ్ఱములు తక్కువయైనందున దక్కనీలు మొగలాయీల సరఫరాలను కొల్లగొట్ట లేకపోయిరి.

తర్వాత నొకవారమునకంతయు బిజాపూరుకోట పడిపోయినది. కాని మొగలాయీల ప్రతాపము వలనకాదు. ఒక