పుట:Adhunikarajyanga025633mbp.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రజలు సంపాదించిరి. ఇకముందు పూర్తిగా పరిపాలనాతంత్రము, రాజనీతిశాస్త్రము ప్రతిమానవునికిని తెలిసి, అనుభవమునకు తెచ్చుకొని ఆచరణలోనికి దిగవలసిన కాలమువచ్చినది. మాంటేగ్యూషేంమ్సుఫర్డు చట్టము మార్చివేసి కొత్త రాజ్యాంగ శాసనము అమలులోనికి రానున్నది. దానివలన ప్రతిరాష్ట్రమందును పూర్తియైన బాధ్యతాయుత ప్రభుత్వము అమలులోనికి వచ్చుచున్నది. కేంద్రప్రభుత్వమందు కూడ కొన్నిమార్పులు రానున్నవి. ఇవన్నియు తమయొక్క హక్కులను, విధులను గుర్తెరింగిన వోటర్లచేత నెన్నుకొనబడిన శాసనసభ్యులు పరిపాలకులను అనగా మంత్రులను ఎన్నుకొని ప్రజలకు బాధ్యులై జవాబుదారితో పరిపాలనను సక్రమముగా జరిగించవలెను. పాశ్చాత్యదేశములలో నేరీతిగా ప్రజాస్వామిక రాజ్య మేర్పడినదో ఆరీతిగా మన హిందూ దేశములోకూడ అమలులోనికి రావలెను.

ఇందులకు ముఖ్యమైన సాధనములు, ప్రజలలో విద్య ప్రబలియుండుట రాజనీతి శాస్త్రము చక్కగా తెలియజేయు గ్రంథములు పఠించుట, మన యాంధ్రభాషలో నిదివరకు (Political Science) రాజనీతి శాస్త్రమును బోధించు గ్రంథములును, ప్రపంచములోనుండు దేశములలో జరుగుచున్న పరిపాలనాక్రమమును వర్ణించు పుస్తకములును విశేషముగా లేవని చెప్పవచ్చును. ఆలోటును తీర్చి ఇంగ్లాండు, అమెరికా,