పుట:Adhunikarajyanga025633mbp.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జర్మనీ, ఫ్రాన్సు, ఇటలీ, జకోస్లొవోకియా, ఆస్ట్రేలియా, కెనడా, మొదలగు నానాదేశములందు అమలులోన్న రాజ్య తంత్రమును వర్ణించుచు, రాజ్యములో నన్నియంగములును ఏయే దేశములలో నేరీతిని పనిచేయుచున్నవో సరిపోల్చుచు, భేదములను కనిపెట్టుచు, మన హిందూదేశమునకు ఏయేమార్గములు పనికివచ్చునో, యివన్నియు తేటతెల్లముగా వర్ణించు గ్రంథము ముఖ్యముగా అవసరము.

మొదట ఈశాస్త్రముయొక్క రూపురేఖలు కొంతవరకు మనకు---------యున్నది. దేశము, పరిపాలన, పరిపాలకులు,--------,లాకోర్టులు, పరిపాలింపబడు ప్రజలు మొదలగు ననేక విషయములను గుర్తించి, వానివాని స్వభావములను ఏర్పాటుచేసి వాని పరస్పర సంబంధములను వర్ణించుశాస్త్రమే రాజనీతి శాస్త్రము.

ప్రపంచములో సృష్టియొక్క ప్రారంభమున సర్వాంగములు వృద్ధి చెందిన పరిపాలనాక్రమము ప్రజలకు తెలియనే తెలియదు. మొదట జనులు అడవులలో జంతువులవలె పచ్చి మాంసమును తినుచు గృహములు, బట్టలు, ఆస్తిమొదలగునవి లేకయే జీవించెడివారు. క్రమముగా కొన్ని జంతువులను మచ్చిక చేసికొని ఆవులు, గేదెలు, కుక్కలు, గుఱ్ఱములు, మేకలు మొదలగువానిని జాగ్రత్తపెట్టుకొని వానివలన జీవయాత్ర గడుపుచు, ఒక ప్రదేశమునుండి మరియొక ప్రదేశ