పుట:Adhunikarajyanga025633mbp.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మునకు తిరుగుచు నుండెడివారు. ఆపరిస్థితులలో వివాహములు, కుటుంబములు, ఆస్తులు, కొంతధర్మశాస్త్రము, మతము మొదలగునవి యేర్పడినవి. క్రమముగా కుటుంబ యజమానుడు అనగా తండ్రి కుటుంబమునకు పెద్దయై పుత్ర పౌత్ర కళత్రాదులను పాలించుచు రాజనీతి శాస్త్రమునకు బీజమును వేసినవాడాయెను. ఈ కుటుంబములయొక్క పెద్దలలో ముఖ్యుడు రాజనియు, కులముయొక్క పెద్దయనియు పిలువబడుచుండెడివాడు. శత్రువులతో పోరాడునప్పుడును తదితర విషమ పరిస్థితులందును వీనియొక్క యధికారము ప్రబలి ఏకరాజ్యాధిపత్యము బ్రాముఖ్యతకు వచ్చినది.

ఈజనసమూహములు దేశసంచారము చేసిచేసి కొంత కాలమైన పిమ్మట అక్కడక్కడ శాశ్వతనివాసములనేర్పాటు చేసికొనిరి. గ్రీసుదేశములోను, హిందూదేశమందును గ్రామములలో నివాసము చేయ మొదలిడి గ్రామపంచాయతీల పరిపాలనా క్రమము అమలులోనికి వచ్చెను. కొంత కాలమునకు ఈగ్రామములు పట్టణములక్రింద మారి (City States) పట్టణరాజ్యములు నిర్మింపబడినవి. ఏథెన్సు, రోము, స్ఫార్టా మొదలగు రాజ్యములు అభివృద్ధిజెంది వాని వాని స్పర్థలచే నాశన మొందినవి. మరికొంతకాలమునకు (Territorial States&Empires) సామంతరాజులు, చక్రవర్తులు ఏర్పడిరి. రోమన్ రాజ్యము, అలగ్జాండరు రాజ్యము మొదలగునవి మిక్కిలి విశా