పుట:Adhunikarajyanga025633mbp.pdf/81

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


దలగడచుటకు, స్వాభివృద్ధిబొందుటకు సావకాశములకల్పించుట, ప్రజాసామాన్యము తమవారసత్వపుహక్కును సర్వస్వతంత్రతతో నుపయోగించుకొనుటకవసరము. మతస్వాతంత్ర్యము, అభిప్రాయప్రకటనాస్వాతంత్ర్యము, స్వశక్తుల ప్రకటించు స్వాతంత్ర్యము, స్వయంనిర్ణయత సూచించుసంస్థలస్థాపించు స్వాతంత్ర్యము, ప్రజలెల్లరికి సంపాదితమైననే ప్రజాస్వామికము శోభాయమానమగును. సాంఘికముగాగాని, రాచకీయముగాగాని, ఆర్థికముగాగాని, ఎట్టివారైనను, అసహాయులైనను ప్రజలకు నూతకల్గించి, స్వయంసహాయశక్తి ప్రజలందరకు ప్రసాదించిననే ప్రజలు తమయందంతర్గర్భితమగు పాలనాశక్తిని, ఇహపరలోకకళ్యాణప్రదమగునట్లు ప్రదర్శించగలదు. ఇట్టి సదుపాయములనన్నిటిని స్వరక్షణకును, స్వవృద్ధికిని, ప్రజాస్వామిక రాజ్యాంగములోని ప్రజలందరికి కల్గించుట అగత్యము, వీనినిప్పటికిని సంపూర్ణముగాగాని, సంతృప్తికరముగాగాని, అనే ప్రజాస్వామిక రాజ్యములు స్థాపించుట లేదు. వీనిని అనుభవమునకుదెచ్చు విధ్యుక్తధర్మము, ప్రతిరాజ్యాంగసంస్థపైనను, రాజ్యాంగవిధానపుచట్టము నిర్ణయించు టత్యంతావశ్యకము. ఈచట్ట మీరెండవధర్మమును పాలించవలసి యున్నది.

రాజ్యాంగవిధానపుచట్టమునందు రాజ్యాంగవిధానపు మూడవధర్మముకూడ ఇప్పుడిప్పుడు పేర్కొనబడుచున్నది. రాజ్యాంగసంస్థల యధికారమునకుమించి, ప్రజల కేయేస్వాతం