పుట:Adhunikarajyanga025633mbp.pdf/80

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఆర్థిక, సాంఘిక, రాచకీయజీవితపథములం దేయేసాధారణ స్వాతంత్ర్యము లెల్లప్పుడు లభ్యపడనగునో నిర్ణయించు టగత్యము. ఆ స్వాతంత్ర్యములకు భంగము లేకుండనే, ప్రజల యందొక్కక్కరికి, వారివారిస్వరక్షణ, స్వపోషణ సముదాయములకు, జీవనాధారమగు స్వత్వముల గౌరవించుచునె, ప్రజాజీవితమందు, దేశజీవితమందు ఆస్వత్వముల మినహాయించగా మిగిలియున్న భాగమునందే వ్యవహరించుటకు రాజ్యాంగసంస్థల నియమించునట్లును, అట్లు ప్రత్యేకింపబడినట్టియి, రాజ్యాంగసంస్థల యధికారమున కతీతమైనట్టియు ప్రజాజీవనమును, ఆసంస్థలు రక్షించునట్లును, రాజ్యాంగవిధానపుచట్టము నిర్ణ యించుట శ్రేయోదాయకము.

ప్రజాస్వామికము జయప్రదమై, సుస్థిరమై, కలకాలము ప్రజలకు శ్రేయోదాయకముగా నుండవలయునన్న ప్రథమప్రకరణమందు వివరింపబడిన సదుపాయములు అగత్యము. వానిని ప్రజలు తమంతతామే కల్గించుకొనుటకు బ్రయత్నించుట శుభప్రదమేకాని, వానిని సంపూర్తిగా వారు స్వయంకృషివలన నేర్పరచుకొనుటదుస్తరము. అట్టిసదుపాయముల కల్గించుటకై రాజ్యాంగవిధానము, తన రాజ్యాంగసంస్థలకు విధికృత్యముగా నేర్పరచు టవసరము. ప్రజలు విజ్ఞానులగునట్లు ప్రజలకు తినుటకుతిండి, త్రాగుటకు పానీయములు కొదువ లేకుండునట్లు జూచుట, అనారోగ్యము బాపుకొనుటకు, ఆప