పుట:Adhunikarajyanga025633mbp.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రించవలసి యుండును; లేక, ఆ ఏబదివేల పౌరులు తమకు వాంఛితమగుపద్ధతి ననుసరించి కేంద్రశాసనసభలను, సవరణను తయారుచేసి 'రిఫరెండము'నకు పెట్టమని కోరవచ్చును. అంత శాసనసభలు ఆసవరణసూత్రమును బిల్లురూపముగా తాము పెట్టవలయునా? యని ప్రజాభీష్టము తెలుసుకొనుటకై 'రిఫరెండము'నకుబెట్టి ప్రజలు తమయామోదమును (రెండు మెజారిటీలద్వారా) తెల్పుచో అంతనాసభలు సవరణబిల్లును తయారుచేసి మరల 'రిఫరెండము'నకు దానిని ప్రజలముందు పెట్టవలయును. ఈవిధముగా ప్రజల యిష్టముపై సవరణబిల్లును దెచ్చుటకుకూడ యీదేశమందు వీలుకలదు. ప్రతిరాజ్యాంగ విధానపు బిల్లును శాసనసభలే కాక, సమ్మేళన మందలి పౌరులం దధికసంఖ్యాకులేకాక, సభ్య కాంటనులం దధికసంఖ్యకూడ యామోదించుయవసర మేర్పరచబడినది.

అమెరికా సంయుక్తరాష్ట్ర సమ్మేళన రాజ్యాంగము 1789 వ సంవత్సరమం దమలులోనికివచ్చెను. ప్రథమపదిసవరణలు

13. అమెరికా
సంయుక్త
రాష్ట్రములు..

1791 లోను, పదకొండు, పన్నెండు సవరణలు 1798, 1804 లలోను, నీగ్రో ప్రజలకు సంబంధించిన మూడుసవరణలు 1865, 1868, 1870 సంవత్సరములందును, మిగిలిన నాల్గుసవరణలు 1913 నుండి 1920 సంవత్సరములలోపలను అంగీకరింపబడినవి. అనగా క్రిందటి శతాబ్దమందు అరువది వత్సరముల పర్యంతము ఒక్క