పుట:Adhunikarajyanga025633mbp.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వీగిపోయినవి. ఈవిధముగ నీదేశపు రాజ్యాంగ విధానము సవరించుటకు దుర్ఘటమైయున్నది.

ఇప్పుడు స్విట్జర్లాండునందు అమలునందున్న రాజ్యాంగవిధానపు చట్టము 1874 వ సంవత్సరమందు నిర్మింపబడెను. ఈ

12. స్విట్జర్లాండు
రాజ్యాంగ
విధానము.

సమ్మేళనమందు యిరువది రెండు సభ్య "కాంటను"లు కలవు. వానిలో మూడు రాచకీయ వ్యవహారములకుగాను ఆరుగాపరిగణింపబడుచున్నవి. కాన మొత్తము ఇరువది ఆరు "కాంటను"లుకలవు. సమ్మేళన రాజ్యాంగపు టధికారములు ఆస్ట్రేలియా, అమెరికాలందువలెనే ఇదమిద్ధమని తేల్పబడియున్నవి. మిగిలిన యధికారములన్నియు సభ్య 'కాంటను'లకు చెందియుండును. సమ్మేళన రాజ్యాంగమందు రెండు శాసనసభలు కలవు. రాజ్యాంగవిధానపుచట్టమును సవరించ వలయునన్న సవరణబిల్లును సమ్మేళనరాజ్యపు రెండుశాసనసభలయొక్కయు, వోటుచేయు వోటరులయొక్కయు కాంటనులందలి అధికసంఖ్యాకుల యామోదమును బొందవలయును. అటుల కాక, ఏబది వేలమంది పౌరులు రాజ్యాంగవిధానపు సవరణ యగత్యమని తలంచి తమసవరణను ప్రభుత్వమునకు పంపించినచో దానిని 'రిఫరెండము' నకు ఆప్రభుత్వము తేవలసియుండును. అప్పుడును ఎప్పటివలెనే ఎన్నికయందు పాల్గొనువోటరులం దధిక సంఖ్యాకులును, కాంటనులందు దధిక సంఖ్యయు ఆ సవరణ నంగీక