పుట:Adhunikarajyanga025633mbp.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగ్రస్థమగు సవరణబిల్లును నిరాకరించుచో రెండవసభ వారాబిల్లును మూడు నెలలపిమ్మట తిరిగి ఆమోదించిపంపుచో దానిని ప్రతిఘటించు సభవారి సవరణలుగల్పిగాని అవ్వేవియు లేకుండనే కాని గవర్నరుజనరలుగారు 'రిఫరెండము' నకు పెట్తవలెను. అంతనా 'రిఫరెండము'నందు అధికసంఖ్యాకమగు సభ్యరాష్ట్రములందలిప్రజలు వోటరులందరియందును అధిక సంఖ్యాకులు నాబిల్లునంగీకరించుచో అయ్యది చట్టమగును. ఏరాష్ట్రమునకు చెందిన యధికారమును తగ్గించుటకు కాని, రాష్ట్రముయొక్క పరిమితులు మార్చుటకుగాని దానికి కేంద్రశాసనసభలయందు నియమితమైన సభ్యత్వముల తగ్గించుటకుగాని, సవరణబిల్లు యేదైనప్రవేశపెట్టబడుచో, అయ్యది రెండుసభలచేతను, వివిధరాష్ట్రములప్రజల చేతను పైనియమములననుసరించి అంగీకరింపబడుటయే కాక వివాదగ్రస్థమగు రాష్ట్రమందలి వోటర్లలో అధిక సంఖ్యాకులచే కూడ ఆమోదింపబడవలయును.

క్రీ. శ. 1926 వ సంవత్సరమున కేంద్రప్రభుత్వమునకు వర్తక వాణిజ్యములనడపుట కధికాధిపత్యమును కోరుచు యొక సవరణ ప్రజావసరములకు సంబంధించిన వాణిజ్యముల అసాధారణపరిస్థితులందు ప్రభుత్వమే నడపుటకధికారము కోరుచు మరొకసవరణ ప్రతిపాదింపబడెను. కాని, ఈ రెండును శాసనసభలయందు ప్రజలమధ్య మెజారిటీలబొంద జాలక