పుట:Adhunikarajyanga025633mbp.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సవరణకూడ అంగీకరింపబడలేదు. క్రిందటి 142 సంవత్సరములందు పందొమ్మిది సవరణలు మాత్రమే అంగీకరింపబడెనన్న ఆరాజ్యాంగ విధానమును మార్చుట యెంత దుర్ఘటమగుచున్నదో వేరుగ చెప్పవలెనా? ఈ రాజ్యాంగ విధానమందును, నియమితమగు రాజ్యాధికారములను మాత్రము సమ్మేళన ప్రభుత్వమున కొసంగి, మిగతారాజ్యాధి కారమునంతను సభ్యరాష్ట్రముల కొసంగవలెను. సమ్మేళనమందు జేరినపిమ్మటకూడ తిరిగి విడివడి స్వతంత్రత బొందవలయునని దక్షిణపురాష్ట్రములు 1864, 1868 సంవత్సరములందు ప్రయత్నముచేసి దేశాంతర్గత యుద్ధముదెచ్చి పెట్టెను. కాని శ్రీ ఆబ్రహాములింకను గారినాయకత్వముక్రింద ఉత్తరాదిరాష్ట్రములు సమ్మేళనరక్షణకై సకలప్రయత్నములు జేసి, తుదకు జయమందెను. ఆయుద్ధఫలితముగా, "ఏసభ్య రాష్ట్రమునకు సమ్మేళనమునుండి వెడలిపోవుటకు వీలు లేదు" అనుసవరణ అంగీకరింపబడెను.

రాజ్యాంగవిధానమును సవరించుటకు, ప్రతిపాదనజేయుటకు, 'కాంగ్రెసు' అను రెండుసమ్మేళన రాజ్యపుశాసనసభలు తమసభ్యులందు మూడింట రెండువంతులు మంది అంగీకరింపవలెను. లేదా, సభ్యరాష్ట్రములందు మూడింట రెండువంతులు సవరణ అవసరమని పిటీషనుపెట్టుచో వివిధ రాష్ట్రముల ప్రతినిధులయొక్క 'కన్వె న్షను'ను కాంగ్రెసు సమావేశపరచవలెను. ఇటుల ప్రతిపాదించబడిన సవరణ