పుట:Adhunikarajyanga025633mbp.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానిని సుప్రీమ్‌కోర్టువారు ధిక్కరించుటకు వీలులేదు. రాజ్యాంగవిధానపు చట్టమును సవరించుటకు శాసనసభయందు సగముమంది సభ్యులైన సమావేశమై వారిలో మూడింట రెండు వంతులు సమ్మతించవలెను. అంత నాసవరణబిల్లును "రిఫరెండము"నకు పెట్టవలెను. వోటులిచ్చినవారిలో మెజారిటీ వారు సుముఖులైనచో ఆసవరణబిల్లు చట్టమునందు జేరును.

కెనడా సమ్మేళనము యొక్క రాజ్యాంగ విధానపు చట్టము 1867 నందు బ్రిటిషు పార్లమెంటుచే నిర్మింపబడినది. అప్పు

7. కెనడా
రాజ్యాంగ
విధానము.

డాసమ్మేళనమందు నాల్గు రాష్ట్రములు చేరెను. ఇప్పటికి తొమ్మిది రాష్ట్రములు చేరినవి. ఈ చట్టమునందు వివిధసభ్య రాష్ట్రముల కొసంగబడిన సభ్యత్వములు నిరూపింపబడినవి. మిగతా రాజ్యాధికారమంతయు సమ్మేళనప్రభుత్వమున కొసంగబడెను. కనుక సభ్య రాష్ట్రముల సంపూర్ణ సమ్మతిలేనిదే వానికొసంగబడిన యధికారములలో దేనినైన మార్పుచేయుటకు సమ్మేళన రాజ్యాంగమున కధికారము లేదు. కాని 1931 సంవత్సరమున బ్రిటిషుపార్లమెంటుచే నిర్మింపబడిన "వెస్టు మినిష్టరు" శాసనము ప్రకారము సమ్మేళన రాజ్యాంగపు విధానమును, కెనడా పార్లమెంటు సాధారణ శాసనముల నిర్మించు ఫక్కిననుసరించియే, సవరణచేయుట కదికారము పొందుచున్నది. తన రాజ్యాంగ విధానమును సవరణ చేసుకొనుటలో మాత్రము కెనడాదేశపు సమ్మేళన