పుట:Adhunikarajyanga025633mbp.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యాంగము ప్రథమతరగతికి జెందుచున్నను, సభ్యరాష్ట్రములకు ప్రసాదించబడిన యధికారముల తగ్గించుటకు హక్కునొంద లేదు గనుక ఈ రెండవతరగతికిని జెందుచునేయున్నది.

దక్షిణాఫ్రికా రాజ్యాంగమందు నాల్గు రాష్ట్రములు కలవు. వీనిలో రెండు బ్రిటిషు ప్రజలచేతను, మరి రెండు డచ్చివారి

8. దక్షిణాఫ్రికా
రాజ్యాంగ
విధానము.

(బోయరులు) చేతను నింపబడియున్నవి. దక్షిణాఫ్రికా యుద్ధము నందు, డచ్చిప్రజలు బ్రిటిషు ప్రజలతో యుద్ధముచేసి వోడిపోయిరి. పతితులైరిగదా యని వారిని నిరసించక డచ్చివారిని కూడ జేర్చి, దక్షిణాఫ్రికాకు అధినివేశ స్వాతంత్ర్యమును బ్రిటిషుప్రభుత్వము ప్రసాదించుచూ, దక్షిణాఫ్రికాకు రాజ్యాంగ విధానచట్టమును 1909 లో నిర్మించెను. (ఈయుదారకృత్యము గాంచియే మహాత్ముడు బ్రిటిషురాజనీతియందు నమ్మకము పొందెను). ఈచట్టముప్రకారము, అప్పటివరకు సర్వస్వతంత్రత బొంది యుండిన రాష్ట్రములయొక్క రాజ్యాధికారమును చాలవరకు తగ్గించి వానిని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమునకు లోబరచిరి. ఈచట్టమునందలి మూడు భాగములుతప్ప మిగతాభాగములన్నిటికిని, అవసరము గల్గినప్పుడు, కేంద్రశాసనసభవారు సాధారణపద్ధతుల ననుసరించి సవరించుట కధికారము ఈచట్ట మొసంగుచున్నది. సవరింపరాని మూడుభాగములీ విధముగా నున్నవి:- ఒకటి - నీగ్రో ప్రజలహక్కులు,