పుట:Adhunikarajyanga025633mbp.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బంధించిన "రైష్‌ రాత్" వారట్టి సవరణబిల్లును అంగీకరింపనిచో పక్షముదినములలోగా నాసభవారు "రిఫరెండము"ను ఆబిల్లుపైకోరుచో, అయ్యది ప్రజలముందు వారి అంగీకారానంగీకారములపై పెట్టబడవలయును. ఈవిధముగా రెండు శాసన సభలు నిర్ణీతమగు పద్ధతిప్రకారమంగీకరించుచో సవరణబిల్లు చట్టమగును. కాని దానిని ప్రజలముందు "రిఫరెండము"నకు తెచ్చుటకై ప్రజలకు "రైష్ రాత్" వారికి హక్కుకలదు.

ఆస్ట్రియాసమ్మేళన రాజ్యాంగము 1918 వ సంవత్సరము నందమలునకు వచ్చెను. సమ్మేళనరాజ్యాంగపు అధికారములు

6. ఆస్ట్రియా
సమ్మేళన
రాజ్యాంగము.

పేర్కొనబడెను. మిగతా యధికారములు సభ్యరాష్ట్రములకు చెందుచున్నవి. సమ్మేళన రాజ్యాంగమునకు పూర్తిగాచెందిన యధికారము లేకాక శిస్తులు, వ్యాపారము, సాంఘిక వ్యవహారములందు ప్రభుత్వమునకు కల్గుజోక్యమునను; కార్మికులు, వ్యవసాయము, సివిలు సర్వీసు ఆదిగాగల విషయములందు కేంద్రశాసనసభ వారుశాసనముల నిర్మించుటకును; అవసరమగు కార్యనిర్వాహకతను రాష్ట్రీయ ప్రభుత్వములు నడుపుటకును యేర్పాటు చేయబడినది. జర్మనీయందువలెనే కొన్ని వ్యవహారములందు రాష్ట్రీయ శాసనసభలతోబాటు కేంద్రశాసన సభవారు శాసననిర్మాణము చేయనగును. కేంద్రశాసనసభవారి శాసనములు జర్మనీయందువలెనే పరమప్రామాణ్య మైనవి.