పుట:Adhunikarajyanga025633mbp.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిర్మించుకొనెను. ఈచట్టముప్రకారము ప్రజాస్వామిక మేర్పరచబడినది. బాధ్యతాయుత ప్రభుత్వము స్థాపించబడెను.

ఈరాజ్యాంగపు చట్టమందే ప్రతీ ఇరువదియైదు సంవత్సరముల కొకమారు రాజ్యాంగ విధానమును సవరించుటకు ప్రయత్నము చేయనగునని ఖండితముగా తెలుపబడియున్నది. సవరణ ప్రతిపాదించుచూ ప్రజాప్రతినిధి సభా సభ్యులలో నాల్గవవంతు మంది దరఖాస్తుపెట్టవలెను. పిమ్మట సెనెటు, ప్రజాప్రతినిధి సభలయందలి సభ్యులలో మూడింట రెండువంతులు మంది అంగీకరించినచో, నాసవరణచట్టముగా ప్రకటింపబడును. ఏలనో 'రిఫరెండము' ఈ రాజ్యాంగ నిర్మాతలు తలపెట్టరైరి. దురదృష్టవశాత్తు ఇప్పటికారు వత్సరములక్రిందటనే పిల్ సూడ్స్కిగారి నిరంకుశాధిపత్యముక్రింద కీదేశము వచ్చినది. ఒకవైపు జర్మనులు, మరొకవైపు రషియనులు పెట్టు రాజకీయ నిర్భంధములకు ప్రజాస్వామిక రాజ్యాంగము తాళజాలదాయెను. తిరిగి యెప్పటికి బాధ్యతాయుత ప్రభుత్వసంస్థలు స్వతంత్రించి వ్యవహరింపగలవో?

యుద్ధమునకు పూర్వము అమలునందున్న సామ్రాజ్యపు రాజ్యాంగవిధాన చట్టమును సవరించుట కడుంగడు

5. జర్మను రాజ్యాంగ
విధానము.

దుస్తరమాయెను. ఏసవరణనైనను పదునల్గురు బందెస్రాతు (రెండవశాసనసభ) సభ్యులెదిరించిన అయ్యది నిరర్ధకమగు చుండెను. ప్రషియా