పుట:Adhunikarajyanga025633mbp.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాష్ట్రమునకే పదునేడుగుర సభ్యత్వము "బందెస్రాతు" నందుండుటచే దానికి అంగీకృతముకాని సవరణలు ఉపసంహ రింపబడవలసినదే! అటులనే తదితర సభ్యరాష్ట్రముల కయిష్టమగు సవరణలును నిరర్ధకములయ్యెడివి. ఆచట్టము ప్రకారము ప్రజాప్రతినిధి సభయగు "రైష్‌టాగ్" కంటె సభ్యరాష్ట్ర ప్రతినిధులచే నిండియుండిన "బందెస్రాత్" చాల ప్రాముఖ్యత వహించియుండెను.

యుద్ధానంతర మేర్పడిన రిపబ్లికునందు ప్రజాప్రతినిధి సభయగు 'రైష్‌టాగ్‌' అత్యంత ప్రాముఖ్యస్థాన మలంకరించుచున్నది. యుద్ధమునకు ముందు రాజ్యాంగవిధానపు సవరణల చర్చుంచుటకే యీసభవారి కర్హత లేదయ్యెను. కాని యిప్పుడు ఈసభవారి సభ్యులలో మూడింట రెండువంతులు మంది అట్టిసవరణ నంగీకరింపవలెను. పిమ్మట సభ్య రాష్ట్రముల ప్రతినిధులచే కూడు 'రైష్‌రాత్‌' యందలి సభ్యులు సమావేశమైనవారిలో మూడింట రెండువంతులమంది అట్టిసవరణను అంగీకరించ వలయును. ఈ రెండు సభలిట్లు సవరణబిల్లు నంగీకరించినపిమ్మట పౌరులలో పదవవంతు మంది ప్రజాభిప్రాయమునకై దానిని "రిఫరెండము"కు పెట్టవలెనని కోరుచో "రిఫరెండము"నందు వోటరులందదిక సంఖ్యాకులు దానిని అంగీకరించిననే శాసనమగును. వారు నిరాకరించుచో అయ్యది నిర్జీవమగును. సభ్యరాష్ట్రములకు సం